Telugu Gateway
Cinema

పిచ్చెక్కిస్తానంటున్న విజయ్

పిచ్చెక్కిస్తానంటున్న విజయ్
X

టాలీవుడ్ కు సంబంధించినంత వరకూ ఓ సినిమా ఫస్ట్ లుక్ కు ఇంత హంగామా చేసింది ఎప్పుడూ చూడలేదు. సినిమా విడుదల సమయంలో ఆయా హీరోల ఫ్యాన్స్ పాలాభిషేకాలు చేయటం,హంగామా అన్నది సాధారణమే. కానీ తాజాగా విజయ్ దేవరకొండ కొత్త సినిమా 'లైగర్'కు సంబంధించి అసాధారణ సంఘటనలు చోటుచేసుకున్నాయి. సినిమా విడుదల సమయంలో చేసినంత హంగామా చేశారు. ఇది చూసిన వారు కూడా అవాక్కు అయ్యే పరిస్థితి. అయితే విజయ్ లైగర్ ఫస్ట్ లుక్...పేరుపై కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగింది. ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకుంటూ పోయారు.

లైగర్ ఫస్ట్ లుక్ హంగామాపై విజయ్ దేవరకొండ కూడా స్పందించారు. "నిన్న మీరు చేసిన పనికి నేను చాలా ఆనందంతో కూడిన భావోద్వేగానికి అయ్యాను. మీ ప్రేమ నా మనసును తాకింది. ఒకప్పుడు అనుకునేవాడిని.. నా పనితనాన్ని ఎవరు గుర్తిస్తారు? నా సినిమా ఎవరు చూస్తారు? అని! కానీ నిన్న కేవలం లైగర్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసినందుకే రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణాన్ని సృష్టించి నన్ను కదిలించారు. ఇప్పుడు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి.. మీరు టీజర్‌ కోసం వెయిట్‌ చేయండి. దేశమంతా పిచ్చెక్కించడం గ్యారెంటీ.. ప్రేమతో మీ మనిషి విజయ్‌ దేవరకొండ" అంటూ సోషల్ మీడియాలో పోస్టుపెట్టారు.

Next Story
Share it