కింగ్డమ్ విడుదల వాయిదా

విజయదేవరకొండ ఫ్యాన్స్ కు నిరాశ కలిగించే వార్త ఇది. మరో పదిహేను రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన కింగ్డమ్ సినిమా విడుదల వాయిదాపడింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ అధికారికంగా వెల్లడించింది. ముందు ప్రకటించిన దాని ప్రకారం ఈ సినిమా మే 30 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షుకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు విడుదల తేదీన జులై 4 కు మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. సమయానికే ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నం చేశాం అని...కానీ దేశంలో చోటుచేసుకున్న అనుకోని పరిస్థితుల వల్ల ముందుకు వెళ్లలేకపోయినట్లు తెలిపారు.
సినిమా విడుదల వాయిదా పడినందున మరింత బెస్ట్ ప్రేక్షకులకు అందిస్తామని ప్రకటించారు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తీరికెక్కుతున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. కింగ్డమ్ మూవీ లో విజయదేవరకొండ కు జోడి గా భాగ్య శ్రీ భోర్సే నటిస్తోంది. ఇప్పటికే జులై 4 న నితిన్ హీరో గా నటించిన తమ్ముడు సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. సో ఇప్పుడు జులై లో ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి.