Telugu Gateway
Cinema

శివ‌రాత్రి స్పెష‌ల్..'భోళాశంక‌ర్' ఫ‌స్ట్ లుక్

శివ‌రాత్రి స్పెష‌ల్..భోళాశంక‌ర్ ఫ‌స్ట్ లుక్
X

సినిమా ప్ర‌చారాల‌కూ సంద‌ర్భం కావాలి. పండ‌గ‌లుంటే అది ఓ స్పెష‌ల్. పండ‌గ‌తోపాటు హీరో, హీరోయిన్ల పుట్టిన రోజుల‌ను త‌మ త‌మ సినిమాల ప్ర‌మోష‌న్ల‌కు వాడుకుంటారు.. ఫ్యాన్స్ లో ఊపు తీసుకొ్స్తారు. భోళాశంక‌ర్ చిత్ర యూనిట్ కూడా అదే ప‌నిచేసింది. శివ‌రాత్రిని పుర‌స్క‌రించ‌కుని ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ తోపాటు వైబ్ ఆఫ్ భోళా పేరుతో స్వ‌ల్ప నిడివి వీడియోను విడుద‌ల చేసింది. ఇందులో చిరంజీవి జీప్ ముందు భాగంలో కూర్చుని త్రిశూలం ఉన్న చైన్ ను స్టైల్ గా ఊపుతూ క‌న్పిస్తాడు.

మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవికి జోడీగా త‌మ‌న్నా న‌టిస్తుంటే..చిరు చెల్లెలులుగా ప్ర‌ముఖ హీరోయిన్ కీర్తిసురేష్ సంద‌డి చేయ‌నుంది. అన్నా, చెల్లెళ్ల అనుబంధంతోపాటు అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. చిరంజీవి ఇప్ప‌టికే ఆచార్య సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకోగా..భోళా శంక‌ర్ తోపాటు మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

Next Story
Share it