అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ

ఇందులో కళ్యాణ్ రామ్ మరో హీరోగా ఆన్నారు. ఆదర్శ కుటుంబం చిత్ర యూనిట్ శనివారం నాడు కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మేరకు రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్నట్లు ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. భార్య, ఇద్దరు పిల్లలతో వెంకీ ఈ పోస్టర్స్‌లో కనిపిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ దసరా పండగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ అక్టోబర్ 2న థియేటర్లలోకి రానుంది.



