Telugu Gateway
Cinema

‘వీరసింహారెడ్డి ’ ఓటిటి డేట్ వచ్చేసింది

‘వీరసింహారెడ్డి ’ ఓటిటి డేట్ వచ్చేసింది
X

సంక్రాంతి సినిమాలు ఓటిటి లో సందడికి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే వాల్తేర్ వీరయ్య డేట్ రాగా...ఇప్పుడు వీరసింహారెడ్డి తేదీ కూడా వచ్చేసింది. వీరసింహారెడ్డి ఫిబ్రవరి 23 సాయంత్రం ఆరు గంటల నుంచి డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఆదివారంనాడే దీనిపై అధికారిక ప్రకటన చేశారు. ఒకే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చిన వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

అయితే కలెక్షన్ల పరంగా చూసుకుంటే వాల్తేర్ వీరయ్య వీరసింహారెడ్డి కంటే చాలా ముందు ఉన్న విషయం తెలిసిందే. అయితే రెండు సినిమాలు అందరికి లాభాలు తెచ్చిపెట్టాయి అనే చెప్పాలి. వీరసింహారెడ్డి సినిమాలో టైటిల్ రోల్ పోషించిన బాలకృష్ణ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో ఆయనకు జోడిగా హనీ రోజ్ నటించారు. మలినేని గోపీచంద్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే వాల్తేర్ వీరయ్య సినిమా ఫిబ్రవరి 27 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రెండు సంక్రాంతి సినిమాల డేట్స్ వచ్చేసినట్లు అయింది.

Next Story
Share it