Telugu Gateway
Cinema

భయపెడుతున్న విజయదేవరకొండ

భయపెడుతున్న విజయదేవరకొండ
X

విజయదేవరకొండ కొత్త సినిమా విడుదల తేదీ వచ్చేసింది. ఇంకా సినిమా పేరు ఖరారు చేయకముందే విడుదల తేదీని ప్రకటించారు. అదే సమయంలో టైటిల్ ను కూడా ఆగస్ట్ నెలలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు. గౌతమ్ తిన్ననూరి కథ అందించి...దర్శకత్వం వహిస్తున్న ఈ వీడి 12 సినిమా వచ్చే ఏడాది మార్చి 28 న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇదే విషయం వెల్లడిస్తూ న్యూ లుక్ విడుదల చేసింది.

ఈ లుక్ తో పాటు విధి పిలిచింది. రక్తపాతం ఎదురుచూస్తోంది. కొత్త రాజు ఉద్భవిస్తాడు అనే క్యాప్షన్ ను కూడా దీనికి జోడించారు. విజయ్ దేవరకొండ ను ఇంత వరకు ఇలాంటి లుక్ లో చూడలేదు అనే విషయం ఈ కొత్త లుక్ చూస్తే తెలిసిపోతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.

Next Story
Share it