ఎన్టీఆర్ బేస్ వాయిస్ ...విజయదేవరకొండ పీల గొంతు
ఫ్యామిలీ స్టార్ మూవీ తర్వాత విజయదేవరకొండ ఫ్యాన్స్ ఆయన కొత్త సినిమా అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే విషయంలో చిత్ర నిర్మాణ సంస్థను విసిగించేలా కూడా మెసేజ్ లు పెడుతూ వచ్చారు. చివరకు చిత్ర యూనిట్ ప్రకటించినట్లుగానే బుధవారం సాయంత్రం విజయదేవర కొండ 12 వ సినిమా టైటిల్ తో పాటు టీజర్ కూడా విడుదల అయింది. అదే సమయంలో ఈ సినిమాను ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నది కూడా అధికారికంగా వెల్లడించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కి కింగ్ డమ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా మే 30 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షుకుల ముందుకు రానుంది. తెలుగు టీజర్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.
ఎన్టీఆర్ వాయిస్ ఉన్నంత వరకు ఓకే కానీ ఎప్పడైతే విజయదేవరకొండ వాయిస్ తో టీజర్ లో డైలాగులు వస్తాయో అప్పుడు ఫీల్ పోతుంది అనే చెప్పాలి. అప్పటి వరకు బేస్ వాయిస్ ఉంది..ఒక్క సారిగా పీల గొంతుతో వాయిస్ వచ్చినట్లు అవుతుంది. ఏమైనా చేస్తా సర్..అవసరం అయితే మొత్తం తగలెబెట్టేస్తా సర్ అంటూ విజయదేవరకొండ చెప్పే డైలాగు లో ఏ మాత్రం ఇంటెన్సిటీ కనిపించదు. అయితే విజయదేవరకొండ మాత్రం గతంలో ఏ సినిమాలో కనిపించని కొత్త లుక్ లో ఇందులో కనిపిస్తున్నారు అనే చెప్పాలి.
అయితే టైటిల్ లో ఉన్న గ్రాండ్ నెస్ టీజర్ లో మిస్ అయింది అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ కింగ్ డమ్ సినిమాను శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఎన్టీఆర్ వాయిస్ ను ఈ సినిమా ప్రమోషన్ కోసం వాడుకోటానికి ప్లాన్ చేశారు కానీ..వెంటనే వెంటనే వచ్చే ఆ వాయిస్ లతో వచ్చే లాభం కంటే నష్టమే అన్న విషయం స్పష్టంగా కనపడుతోంది. ఎందుకంటే ఆ తేడా టీజర్ చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఫీల్ అవుతాడు కాబట్టి.