Telugu Gateway
Cinema

మాస్ మోడ్ లోకి వరుణ్ తేజ్!

మాస్ మోడ్ లోకి వరుణ్ తేజ్!
X

వరుణ్ తేజ్ కొత్త సినిమా మట్కా విడుదల తేదీ వచ్చేసింది. ఈ సినిమాను నవంబర్ 14 న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. కె అరుణ్ కుమార్ కథ అందించి...దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. మరో కీలక పాత్రలో బాలీవుడ్ నటి నోరా ఫతేహి కూడా కనిపించనుంది.

వరుణ్ తేజ్ గత సినిమాలు ఆపరేషన్ వాలంటైన్, గాండీవధారి అర్జున బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఈ మెగా హీరో ఇప్పుడు లైన్ మార్చి మాస్ స్టోరీ తో కూడిన మట్కా తో ప్రేక్షకుల ముందుకు రావటానికి రెడీ అయినట్లు కనిపిస్తోంది. రిలీజ్ డేట్ తో కూడిన మట్కా న్యూ లుక్ ను చిత్ర యూనిట్ మంగళవారం నాడు విడుదల చేసింది. మట్కా సినిమా కు జీ వీ ప్రకాష్ మ్యూజిక్ అందించారు.

Next Story
Share it