వరుణ్ తేజ్ కెరీర్ లోనే రికార్డు !

కొరియన్ కనకరాజు మూవీ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్మురేపింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో వరుణ్ తేజ్, రితికా నాయక్ లు జంటగా నటించారు. ఈ సినిమా విజయంలో కమెడియన్ సత్య కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా హీరో వరుణ్ తేజ్, సత్య ల కాంబినేషన్ లో వచ్చిన కామెడీ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సినిమా ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఈ కామెడీనే ఈ మూవీని నిలబెట్టింది. కొరియన్ కనకరాజు మూవీ ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా 10 .20 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.గురువారం రాత్రి వేసిన ప్రీమియర్స్ తో కలుపుకుని ఈ మొత్తం సాధించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.



