Telugu Gateway
Cinema

అదిరిపోయే డైలాగ్స్ తో 'వ‌రుడు కావ‌లెను' టీజ‌ర్

అదిరిపోయే డైలాగ్స్ తో  వ‌రుడు కావ‌లెను  టీజ‌ర్
X

టీజ‌ర్ అదిరింది. డైలాగు లు పేలాయి. ఒక్క దెబ్బ‌తో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. ఇవీ 'వ‌రుడు కావ‌లెను' టీజ‌ర్ విశేషాలు. రీతూవ‌ర్మ పెళ్లిచూపుల సీన్ తో ఈ టీజ‌ర్ ప్రారంభం అవుతుంది. 'అమ్మా వీళ్ళు ఎవ‌రూ నాకు క‌నెక్ట్ అవ‌టం లేదే. ' అంటూ రీతూ వ‌ర్మ డైలాగ్ చెపితే అన్నింటికి ఇవే అంటావ్..ఇప్పుడు నీ వ‌య‌స్సు 30 అంటూ న‌దియా ఇచ్చే కౌంట‌ర్ తో మొద‌ల‌వుతుంది. ఆ అందం..ఆ పొగ‌రు ఆర్డ‌ర్ ఇచ్చి చేయించిన‌ట్లు ఉంది. త‌ను అంద‌రిలా కాదురా..చాలా కొత్త‌గా ఉంది. మీ బాస్ ఏంటి భ‌య్యా ఏడారిలో ఐస్ త‌యారు చేద్దామ‌ని చూస్తున్నాడు.

ఎవ్రీ బాల్ ను సిక్స్ కొట్టే బ్యాట్స్ మ‌న్ ను చూశావా. మా వాడు కొడ‌తాడు అంటే...ప్ర‌తి బాల్ ను నో బాల్ ఇచ్చే అంపైర్ ను చూశావా..ఆమె ఇస్త‌ది అంటూ సాగే డైలాగ్ ల‌తో ఈ టీజ‌ర్ స‌ర‌ద స‌ర‌దాగా సాగిపోయింది. హీరో నాగ శౌర్య‌, హీరోయిన్ రీతూ వ‌ర్మ‌లు ఇద్ద‌రూ త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయిన‌ట్లు క‌న్పిస్తోంది. అక్టోబ‌ర్ లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు టీజ‌ర్ విడుద‌ల సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు చిత్ర యూనిట్. ల‌క్ష్మీ సౌజ‌న్య ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌గా...సూర్య‌దేవ‌ర నాగవంశీ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Next Story
Share it