Telugu Gateway
Cinema

ద‌స‌రాకు వ‌స్తున్న 'వ‌రుడు కావ‌లెను'

ద‌స‌రాకు వ‌స్తున్న వ‌రుడు కావ‌లెను
X

నాగ‌శౌర్య‌, రీతూవ‌ర్మ జంటగా న‌టిస్తున్న సినిమా 'వ‌రుడు కావ‌లెను'. తాజాగా విడుద‌ల చేసిన ఈ సినిమా టీజ‌ర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. దిగు దిగు నాగ పాట వివాద‌స్ప‌దం అయినా మ‌రో పాట 'మ‌న‌సులోన నిలిచిపోకే' లిరికల్ సాంగ్ మాత్రం ఆక‌ట్టుకునేలా ఉంది. ఈ సినిమా ద‌స‌రా సంద‌ర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అక్టోబ‌ర్ 15న ఈ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ శ‌నివారం నాడు అధికారికంగా ప్ర‌క‌టించింది. ల‌క్ష్మీ సౌజ‌న్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాను సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. టీజ‌ర్, పాట‌లు చూసిన త‌ర్వాత సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయ‌నే చెప్పొచ్చు.

Next Story
Share it