Telugu Gateway
Cinema

బాలకృష్ణ సినిమాలో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్

బాలకృష్ణ సినిమాలో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్
X

విల‌క్షణ పాత్ర‌లు ద‌క్కించుకుంటూ టాలీవుడ్ లోనూ దూసుకెళుతుంది వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్. తాజాగా ఆమె నందమూరి బాలకృష్ణ, శృతీ హాసన్‌లు జంట‌గా న‌టిస్తున్న సినిమాలో కీల‌క పాత్ర ద‌క్కించుకుంది. ఆమెకు స్వాగ‌తం ప‌లుకుతూ చిత్ర యూనిట్ ఓ అప్ డేట్ ను విడుద‌ల చేసింది. ఎన్ బికె 107 పేరుతో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాత‌లు. తాజాగా ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ ను కూడా తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇప్పుడు వ‌ర‌ల‌క్ష్మీ అప్ డేట్ ఇచ్చారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అఖండ విజ‌యంతో బాలకృష్ణ దూకుడు మీద ఉన్న విష‌యం తెలిసిందే.

Next Story
Share it