వకీల్ సాబ్ 'సత్యమేవ జయతే' పాట విడుదల
BY Admin3 March 2021 12:15 PM GMT
X
Admin3 March 2021 12:15 PM GMT
వకీల్ సాబ్ సినిమా నుంచి 'సత్యమేవ జయతే' పాటను చిత్ర యూనిట్ బుధవారం సాయంత్రం విడుదల చేసింది. 'జన జన జన, జన ఘనమున కలగలసిన జనమనిషిరా. మన మన మన..మన తరపున నిలబడ గల నిజం మనిషిరా. నిషి ముసిరినా కలలను తన వెలుగుతో గెలిపించు ఘనుడురా, పడి నలిగిన బతుకులకు ఒక భుజం ఇవ్వగలడురా. వదలనే వదలడు ఎదురుగా తప్పు జరిగితే ' అంటూ సాగే పాట వింటే సినిమా కోసం రాసిందా లేక జనసేన కోసం రాసిందా అన్న సందేహం రావటం ఖాయం.
బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా ఏప్రిల్ 9 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తోపాటు శృతిహాసన్ అంజలి, నివేదా థామస్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
Next Story