ఏప్రిల్ 30 నుంచి అమెజాన్ లో 'వకీల్ సాబ్'
BY Admin27 April 2021 12:22 PM

X
Admin27 April 2021 12:22 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా 'వకీల్ సాబ్' ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది. ఏప్రిల్ 30 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని అమెజాన్ ట్వీట్ ద్వారా వెల్లడించింది. పవన్ కళ్యాణ్, శృతిహాసన్, నివేదా దామస్, అంజలి, అనన్యలు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలే దక్కించుకుంది.
అయితే కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు థియేటర్లు మూతపడటంతో తర్వాత తర్వాత కలెక్షన్లపై దెబ్బపడింది. ఇక థియేటర్లలో సినిమా చూసే ఛాన్స్ లేకపోవటంతో అమెజాన్ లో విడుదల తేదీని ఖరారు చేసినట్లు కన్పిస్తోంది. బాలీవుడ్ హిట్ మూవీ పింక్ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు.
Next Story