వకీల్ సాబ్ ట్రైలర్ విడుదల
BY Admin29 March 2021 12:58 PM

X
Admin29 March 2021 12:58 PM
పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమా ట్రైలర్ సోమవారం సాయంత్రం విడుదల అయింది. ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని కూడా చిత్ర యూనిట్ పెద్ద ఉత్సవంగా నిర్వహించింది. మూడేళ్ల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ వెండితెరపై కన్పించనున్నతొలి సినిమా ఇదే కావటంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కూడా ఎంతో ఉత్సాహం ఉంది.
ట్రైలర్ లో కోర్టు సీన్లే ట్రైలర్ లో హైలెట్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ ల మధ్య వచ్చే డైలాగ్ లు కీలకంగా ఉన్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా శృతిహాసన్ నటించిన విషయం తెలిసిందే.
Next Story