Telugu Gateway
Cinema

'వకీల్ సాబ్' కూడా వచ్చేస్తున్నాడు

వకీల్ సాబ్ కూడా వచ్చేస్తున్నాడు
X

వకీల్ సాబ్ కు కూడా ముహుర్తం కుదిరింది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన తొలి సినిమా ఇది. అందుకే ఈ సినిమాపై ఆయన అభిమానులతోపాటు ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. తాజాగా విడుదల చేసిన సినిమా టీజర్ కూడా వకీల్ సాబ్ పై అంచనాలను మరింత పెంచాయి. ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది.

గబ్బర్‌ సింగ్‌, కాటమరాయుడు సినిమాల్లో పవన్‌కు జోడీగా నటించిన శ్రుతి హాసన్‌ వకీల్‌ సాబ్‌లో పవన్‌తో కలసి మరోసారి సందడి చేయనున్నారు.. హిందీలో సూపర్ హిట్ అయిన 'పింక్' చిత్రాన్ని తెలుగులో 'వకీల్ సాబ్' పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. శృతిహాసన్ తోపాటు ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా రూపొందిస్తున్నారు.

Next Story
Share it