Telugu Gateway
Cinema

'వకీల్ సాబ్' సెన్సార్ పూర్తి

వకీల్ సాబ్ సెన్సార్ పూర్తి
X

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ముహుర్తం దగ్గరకొచ్చింది. మూడేళ్ల తర్వాత విడుదల అవుతున్న ఆయన సినిమా 'వకీల్ సాబ్' సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. హిందీలోసూపర్ హిట్ అయిన పింక్ కు రీమేక్ గా ఈ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

శ్రీరామ్ వేణు ద‌ర్శ‌కుడు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా ఏప్రిల్ 9న విడుద‌ల కాబోతోంది. ఈ సినిమా నిడివి 154 నిమిషాలుగా ఉన్నట్లు సమాచారం. వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ కు జోడీగా శృతిహాసన్ నటించగా, నివేదా థామస్, అంజలి, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Next Story
Share it