వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభం
BY Admin2 April 2021 5:58 AM GMT
X
Admin2 April 2021 5:58 AM GMT
ఓ హీరోకు, హీరోయిన్ కు తొలి సినిమానే సూపర్ హిట్ కావటం అంటే మామూలు విషయం కాదు. కానీ వైష్ణవ్ తేజ్, కృతిశెట్టిలకు మాత్రం ఈ అదృష్టం వరించింది. వీరిద్దరూ కలసి నటించిన 'ఉప్పెన' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు సాధించి రికార్డులు నమోదు చేసింది. వైష్ణవ్ తేజ్ నటనకు కూడా అంతే మార్కులు పడ్డాయి. ఆయన కొత్త సినిమా శుక్రవారం నాడు లాంఛనంగా ప్రారంభం అయింది.
ఈ సినిమాలో ఆయనకు జోడీగా కేతిక శర్మ నటిస్తోంది. అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్‌ను డైరెక్ట్ చేసిన గిరీశయ్యతో చేస్తున్న సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. శుక్రవారం సాయి ధరమ్ తేజ్ క్లాప్ కొట్టి ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
Next Story