Telugu Gateway
Cinema

'బంగార్రాజు' పాట విడుద‌ల‌

బంగార్రాజు పాట విడుద‌ల‌
X

అక్కినేని నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌లు న‌టిస్తున్న సినిమా 'బంగార్రాజు' . ఈ సినిమాకు సంబంధించి వాసివాడి తస్సాదియ్యా లిరిక‌ల్ సాంగ్ ను చిత్ర యూనిట్ ఆదివారం సాయంత్రం విడుద‌ల చేసింది. ఈ సినిమాలో నాగార్జున‌కు జోడీగా ర‌మ్య‌క్రిష్ణ నటిస్తుంటే..నాగ‌చైత‌న్య‌కు జోడీగా కృతి శెట్టి సందడి చేయ‌నుంది. కొత్త‌గా విడుద‌లైన ఈ ప్ర‌త్యేక పాట‌లో జాతిర‌త్నాల భామ ఫ‌రియా అబ్దుల్లా ఆడిపాడింది. క‌ళ్యాణ్ క్రిష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని యోచ‌న‌లో ఉన్నారు చిత్ర యూనిట్. బంగార్రాజు సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

Next Story
Share it