ఏపీ సర్కారు విధానాలతో ప్రతిష్టాత్మక వి ఎపిక్ థియేటర్ మూత

దేశంలోనే అతి పెద్ద స్క్రీన్లలో ఒకటైన నెల్లూరులోని వి ఎపిక్ థియేటర్ మూతపడింది. పూర్తిగా సర్కారు టిక్కెట్ విధానాల కారణంగానే ఈ థియేటర్ ను మూసివేశారు. శనివారం నుంచే ఇందులో సినిమాల ప్రదర్శనకు బ్రేక్ పడింది. జిల్లా యంత్రాంగం అతి తక్కువ ధరలకే సినిమా టిక్కెట్లను విక్రయించాల్సిందిగా ఒత్తిడి తెస్తుండటంతో..ఆ ధరతో కనీసం విద్యుత్ బిల్లుల వ్యయం కూడా రాదని..అందుకే సినిమా థియేటర్ ను మూసివేసినట్లు ప్రకటించారు నిర్వాహకులు. నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరుపేటలో ఇది ఓ ప్రతిష్టాత్మక థియేటర్ గా ఉంది.
ఈ ధరలతో థియేటర్ లో సినిమాలు ప్రదర్శిస్తే కంటే..ప్రదర్శించకుండా ఉంటేనే లాభం అని పేర్కొన్నారు. ప్రభుత్వం ఖరారు చేసినన రేట్లతో సినిమాలు తమ థియేటర్ లో ప్రదర్శించాలంటే భారీ నష్టాలు మూటకట్టుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక సినిమా థియేటర్ ను యూవీ క్రియేషన్స్ లో సహ భాగస్వామిగా ఉన్న వంశీ క్రిష్ణారెడ్డి నెలకొల్పారు. 2019 ఆగస్టు 29న ఈ థియేటర్ ను ప్రారంభించారు.