Telugu Gateway
Cinema

'ఉప్పెన' విడుదల ఫిబ్రవరి 12న

ఉప్పెన విడుదల ఫిబ్రవరి 12న
X

'ఉప్పెన' ఈ సినిమా పాటలతోనే ఓ హైప్ తెచ్చుకుంది. 'నీ కన్ను నీలిసముద్రం' పాట యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమాపై కరోనా దెబ్బ పడింది. వైష్ణవ్ తేజ్ తొలి సినిమా. అందుకే ఓటీటీలో విడుదల చేయకుండా థియేటర్లలోనే సినిమా విడుదలకు నిర్ణయం తీసుకుని ఇఫ్పటివరకూ ఆగారు. తాజాగా ఈ సినిమా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తుండగా తమిళ స్టార్‌ నటుడు విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు.

బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్ సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఆదివారం ఈ సినిమా నుంచి `జ‌ల జ‌ల జ‌ల‌పాతం నువ్వు.. సెల సెల సెల‌యేరు నేను...` సాంగ్‌ను హీరో విజయ్ దేవరకొండ విడుద‌ల చేశారు. శ్రీమ‌ణి రాసిన ఈ పాట‌ను జ‌స్‌ప్రీత్ జ‌స్‌, శ్రేయా ఘోష‌ల్ పాడారు. కొన్ని సినిమాలు పాటలతో హైప్ తెచ్చుకుని మంచి విజయాలు దక్కించుకుంటాయి. మరి ఉప్పెన విషయంలో ఏమి జరుగుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it