Telugu Gateway
Cinema

అదరగొడుతున్న 'ఉప్పెన టీజర్'

అదరగొడుతున్న ఉప్పెన టీజర్
X

పాటలతో 'ఉప్పెన' సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. హీరో వైష్ణవ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన 'టీజర్' సినిమాపై అంచనాలను మరింత పెంచేసిందనే చెప్పాలి. ఈ టీజర్ లో సన్నివేశాలు..డైలాగ్ లు యూత్ ను ఆకట్టుకునేలా ఉన్నాయనటంలో ఈ మాత్రం సందేహం లేదు. వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. 'దేవుడే వరాలు ఇస్తాడని నాకు అర్థమైంది.

ఎవరికి పుట్టామో తెలుస్తుంది కానీ, ఎవరికోసం పుట్టామో నాకు చిన్నప్పుడే తెలిసిపోయింది.. అని హీరో చెప్పే డైలాగ్‌తో టీజర్ ప్రారంభం అవుతుంది. 'వీడు ముసలోడు అవ్వకూడదే' అని చెప్పే హీరోయిన్ ఆకట్టుకుంటుంది. ఇందులో వైష్ణవ్‌ వెరైటీగా మీసాలు తిప్పుతూ కన్పిస్తాడు. ఉప్పెన గతేడాది వేసవిలో విడుదల కావాల్సింది. అన్ని సినిమాల తరహాలోనే కరోనా వైరస్‌ ప్రభావం ఈ సినిమాపై పడింది.

Next Story
Share it