Telugu Gateway
Cinema

'అన్ స్టాప‌బుల్' ఆంథ‌మ్ విడుద‌ల‌

అన్ స్టాప‌బుల్  ఆంథ‌మ్ విడుద‌ల‌
X

ఆహా ఓటీటీలో ప్ర‌ముఖ హీరో నంద‌మూరి బాల‌క్రిష్ణ హోస్ట్ గా సాగ‌నున్న షో 'అన్ స్టాప‌బుల్' రెండ‌వ సీజ‌న్ ప్రారంభం కానుంది. ఇది వ‌చ్చే నెల నుంచి ప్రారంభం కానుండ‌టంతో దీనికి సంబంధించి ఓటీటీ యాజ‌మాన్యం 'అన్ స్టాప‌బుల్' ఆంథ‌మ్ ను విడుద‌ల చేశారు. త‌ను ఎంట్రీ ఇస్తే కంట్రీ అంతా ఊగేనంట అంటూ సాగే ఆంథమ్ హుషారు నింపేలా ఉంది. గ‌త సీజ‌న్ లో నిర్వ‌హించిన ప‌లు క్లిప్పింగ్ ల‌తో దీన్ని విడుద‌ల చేశారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో బాల‌క్రిష్ణ హోస్ట్ చేసిన ఈ షో సూప‌ర్ స‌క్సెస్ అయింది. అదే స‌మ‌యంలో రెండ‌వ సీజ‌న్ పై కూడా భారీ అంచ‌నాలే ఉన్నాయి. అయితే ఈ సారి ఈ షోలో పాల్గొనే అతిధులు ఎవ‌రెవ‌రు అన్న అంశం కూడా ఆస‌క్తిక‌రంగా మారింది.

Next Story
Share it