Telugu Gateway
Cinema

సంక్రాంతి సినిమాలు రెండు....వసూళ్లు 324 కోట్లు

సంక్రాంతి సినిమాలు రెండు....వసూళ్లు 324 కోట్లు
X

రెండు తెలుగు రాష్ట్రాలు. రెండు సంక్రాంతి సినిమాలు . పదకొండు రోజులు. చేసిన వసూళ్లు అక్షరాలా 324 కోట్ల రూపాయలు. ఇవి జనవరి 22 అంటే ఆదివారం నాటికి ఉన్న లెక్కలు. ఇందులో చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా వాటా 200 కోట్ల రూపాయలు అయితే..నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహ రెడ్డి వాటా 124 కోట్ల రూపాయలు. అంటే కేవలం రెండు సినిమాలపై తెలుగు రాష్ట్రాల ప్రజలు కేవలం టికెట్ల వరకే ఇంత మేర ఖర్చు పెట్టారు. ఇందులో కొంత అమెరికా మార్కెట్ వసూళ్లు కూడా ఉన్నాయి. అయినా అవి కూడా తెలుగు వాళ్ళ డబ్బు కిందే లెక్క వేసుకోవాల్సిందే. తెలుగులో విడుదల అయిన వారసుడు సినిమా లెక్కలు కూడా వేసుకుంటే ఈ మొత్తం మరింత పెరుగుతుంది.

ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. అందరు లాభాల్లోనే ఉన్నారు. అయితే బాలకృష్ణ సినిమాతో పోలిస్తే చిరంజీవి సినిమాకు అటు వసూళ్లు...ఇటు లాభాలు కూడా ఎక్కువే. అదే సమయంలో ఆ సినిమాకు అయిన ఖర్చు కూడా ఎక్కువే అని చెపుతున్నారు. దీనికి ప్రధాన కారణం చిరంజీవి తో పాటు రవి తేజ రెమ్యూనరేషన్ తదితర అంశాలు ఉన్నాయి. మొత్తానికి విడుదల అయిన రెండు సినిమాలు విజయవంతం కావటంతో టాలీవుడ్ మొత్తం హ్యాపీ హ్యాపీగా ఉందనే చెప్పాలి.

Next Story
Share it