టక్ జగదీస్ సినిమా విడుదల తేదీ దగ్గరకొస్తుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగం పెంచింది. నాని, రీతూవర్మ జంటగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానున్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. అంతే కాదు..దర్శకుడు శివ నిర్వాణ ఏకంగా టక్ సాంగ్ పేరుతో విడుదలైన పాట పాడారు. ఈ పాటను చిత్ర యూనిట్ శుక్రవారం నాడు విడుదల చేసింది. మీరూ చేసేయండి ఓ సారి.