Telugu Gateway
Cinema

'టక్ జగదీష్' సినిమా విడుదల వాయిదా

టక్ జగదీష్ సినిమా విడుదల వాయిదా
X

టాలీవుడ్ లో కరోనా దెబ్బ బాగానే ప్రభావం చూపిస్తోంది. వరస పెట్టి సినిమాల విడుదల వాయిదా పడుతూ పోతున్నాయి. ఇప్పటికే నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన 'లవ్ స్టోరీ' విడుదలకు బ్రేక్ పడింది. ఇప్పుడు టక్ జగదీష్ వంతు వచ్చింది. ఉగాది రోజున విడుదల చేయాల్సిన థియేట్రికల్ ట్రైలర్ ను కూడా విడుదల చేయటంలేదని హీరో నాని స్వయంగా వెల్లడించారు.

టక్ జగదీష్ సినిమా ఫ్యామిలీ అంతా..ఇంటిల్లిపాదీ చూడాల్సిన సినిమా అని..అందుకు ప్రస్తుతం పరిస్థితులు అంత అనుకూలంగా లేవన్నారు. అందుకే చిన్న బ్రేక్ తీసుకున్నట్లు వెల్లడించారు. వాస్తవానికి టక్ జగదీష్ సినిమా ఏప్రిల్ 23న విడుదల కావాల్సి ఉంది. త్వరలోనే ట్రైలర్ విడుదల చేస్తామని..అదే రోజున విడుదల తేదీ కూడా వెల్లడిస్తామని నాని తెలిపారు.

Next Story
Share it