త్రిష పోస్ట్‌తో మారిన సీన్!

తమిళనాడు సీఎం విజయ్, ఆయన సన్నిహితురాలు త్రిష మధ్య గ్యాప్ పెరిగింది అంటూ మంగళవారం ఉదయం నుంచి వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ సారి విజయ్ పుట్టిన రోజు సందర్భంగా త్రిష ఆయనకు పుట్టిన రోజు విషెష్ చెపుతూ పోస్ట్ షేర్ చేయలేదు. ప్రతి ఏటా ఇద్దరూ కలిసి దిగిన ప్రత్యేక ఫోటో లతో విషెష్ చెప్పే త్రిష ఈ సారి అందుకు బిన్నంగా వ్యవహరించటంతో ఏదో జరిగింది అనే ప్రచారం మొదలైంది. వీటికి తోడు ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ ను త్రిష అన్ ఫాలో చేసినట్లు కూడా వార్తలు రావటంతో వీళ్ళిద్దరూ బ్రేకప్ బాటలో సాగబోతున్నట్లు ప్రచారం సాగింది. అయితే మంగళవారం సాయంత్రం ఒక్క ఫోటో తో హీరోయిన్ త్రిష రూమర్స్ కు చెక్ పెట్టింది. మంగళవారం ఉదయం నుంచి త్రిష తమిళనాడు సీఎం విజయ్ కు ఈ సారి పుట్టిన రోజు విషెష్ చెప్పలేదు అంటూ మీడియా లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.



