ఏ సర్టిఫికెట్ తప్పదా?!

ఈ సారి యుద్ధం వేరు. వాళ్ళ కుతంత్రాలు వేరు. అందరితో విరోధం పెట్టుకుని బతకలేం. పట్టుదల వదిలేయ్. గివ్ అప్ రాయా వంటి పవర్ ఫుల్ డైలాగులతో టాక్సిక్ టీజర్ శుక్రవారం నాడు విడుదల అయింది. పూర్తి స్థాయి యాక్షన్ సన్నివేశాలతో ...కంప్లీట్ వయలెంట్ సీన్స్ తోనే ఇది నిండి ఉంది. హీరో యష్ ఇందులో పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నట్లు టీజర్ చూస్తే స్పష్టం అవుతోంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 19 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షుకుల ముందుకు రాబోతోంది.



