Telugu Gateway
Cinema

పది రోజుల పాటు అమల్లో

పది రోజుల పాటు అమల్లో
X

ఈ వారంలో విడుదల అవుతున్న భారీ బడ్జెట్ సినిమా టాక్సిక్. యష్ హీరో గా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కేజీఎఫ్ రెండు భాగాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత యష్ నటించిన సినిమా ఇదే కావటంతో ఈ మూవీ పై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్ తో పాటు ఇతర వీడియోల్లో శృతి మించి హింస, శృంగార సన్నివేశాలు ఉండటంతో అదే స్థాయిలో విమర్శలు కూడా వ్యక్తం అయ్యాయి. టాక్సిక్ సినిమా బుధవారం నాడే ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దేశ వ్యాప్తంగా కూడా ఈ సినిమా కు అడ్వాన్స్ బుకింగ్స్ బాగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తెలంగాణ లో టాక్సిక్ మూవీ సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. దీంతో పెంచిన రేట్లకు అనుగుణంగా వెంటనే బుకింగ్స్ కూడా మంగళవారం మధ్యాహ్నం నుంచే ఓపెన్ అయ్యాయి.

సింగిల్ స్క్రీన్స్ లో 50 రూపాయలు, మల్టీ ఫ్లెక్స్ ల్లో వంద రూపాయల లెక్కన ధరలు పెంచుకోవటానికి అనుమతి ఇచ్చారు. పెంచిన ధరలు పది రోజుల పాటు ఉంటాయి.. రోజుకు ఐదు షో లకు కూడా అనుమతి ఇచ్చారు. టికెట్ రేట్లు పెంచినందుకు తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ కు కోటి రూపాయలు డిపాజిట్ చేయాలని నిర్మాణ సంస్థ కు సూచించారు. గీతూమోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన టాక్సిక్ మూవీ లో యష్ తో పాటు ఏకంగా ఐదుగురు హీరోయిన్ లు నటిస్తున్నారు. ఇందులో నయనతార, కియారా అద్వానీ, వసంత్ రుక్మిణి, తారా సుతారియా, హ్యూమా ఖురేషి లు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా నిడివి ఏకంగా మూడు గంటల 14 నిమిషాలుగా ఉంది.

Next Story
Share it