Telugu Gateway
Cinema

ర‌కుల్ అప్పుడు లేదు....ఇప్పుడే ఎందుకొచ్చింది?!

ర‌కుల్ అప్పుడు లేదు....ఇప్పుడే ఎందుకొచ్చింది?!
X

టాలీవుడ్ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం ఆస‌క్తిక‌ర మ‌లుపులు తిరుగుతోంది. గ‌తంలోనే టాలీవుడ్ సెల‌బ్రిటీల‌ను ఎక్సైజ్ శాఖ ఈ కేసులో విచారించింది. ఆ విచార‌ణ జాబితాలో ప్ర‌ముఖ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ లేదు. కానీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్ట‌రేట్ (ఈడీ) విచార‌ణ‌లో మాత్రం ఆమె పేరు చోటుచేసుకుంది. ఇదే ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈడీ విచార‌ణకు హాజ‌రు కావాల్సిందిగా ర‌కుల్ ప్రీత్ సింగ్ కు నోటీసులు జారీ చేసింది. ఆమెను సెప్టెంబ‌ర్ 6న హాజ‌రు కావాల్సిందిగా కోర‌గా..ఆ రోజు అనివార్య కార‌ణాల వ‌ల్ల తాను హాజ‌రు కాలేన‌ని..మ‌రో తేదీ కేటాయించాల‌ని కోరిన‌ట్లు స‌మాచారం. బాలీవుడ్ డ్ర‌గ్స్ కేసు వెలుగులోకి వ‌చ్చిన స‌మ‌యంలోనూ ర‌కుల్ ప్రీత్ సింగ్ పేరు పెద్ద ఎత్తున ప్ర‌చారంలోకి వ‌చ్చింది.

దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఆమె కోర్టును కూడా ఆశ్ర‌యించి మీడియాలో త‌న పేరు రాకుండా చూడాల‌ని కోరారు. అయితే ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ చేయ‌టంతో వ్య‌వ‌హ‌రం కొత్త మ‌లుపు తిరిగిన‌ట్లు అయింది. ప‌క్కా ఆధారాల‌తోనే ఈడీ సినిమా సెల‌బ్రిటీల‌ను విచారిస్తోంద‌ని..దీనికి సంబంధించిన స‌మాచారం వారి వ‌ద్ద ఉన్న‌ట్లు అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి. ర‌కుల్ ప్రీత్ సింగ్ పేరుతో రాజ‌కీయ లింకులు కూడా ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. మ‌రి ఈడీ విచార‌ణ‌లో ఈ విష‌యాలు అన్నీ బ‌హిర్గ‌తం అవుతాయా? లేక ఎప్ప‌టిలాగానే ముగిసిపోతుందా అన్న‌ది వేచిచూడాల్సిందే.

Next Story
Share it