Telugu Gateway
Cinema

డ్ర‌గ్స్ కేసు..ర‌వితేజ విచార‌ణ పూర్తి

డ్ర‌గ్స్ కేసు..ర‌వితేజ విచార‌ణ పూర్తి
X

డ్ర‌గ్స్ కేసు విచార‌ణ కొన‌సాగుతోంది. గురువారం నాడు ప్ర‌ముఖ హీరో ర‌వితేజ ఎన్ ఫోర్స్ మెంట్ డైర‌క్ట‌రేట్ (ఈడీ) అధికారుల ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఆయనతో పాటు ఆయన డ్రైవర్‌ శ్రీనివాస్ కూడా వ‌చ్చారు. ఆరు గంటలపాటు రవితేజ, డ్రైవర్ శ్రీనివాస్‌లను ఈడీ అధికారులు ప్రశ్నించారు. మ‌నీలాండ‌రింగ్ వ్య‌వ‌హ‌రంలోనే ర‌వితేజను కూడా ప్ర‌శ్నించిన‌ట్లు స‌మాచారం. కెల్విన్ తో సంబంధాలు..బ్యాంకు లావాదేవీల వ్య‌వ‌హ‌రంపై ఆరా తీశారు. అంతే కాకుండా ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న జిషాన్‌ 2017లో కొకైన్ సరఫరా చేస్తూ ఎక్సైజ్ శాఖకు దొరికాడు.

జిషాన్‌తో పాటు బెర్నాడ్ అలియాస్ విలియమ్స్‌ను ఎక్సైజ్ శాఖ అరెస్ట్‌ చేసింది. ఎఫ్ ప్రొడక్షన్‌కు జిషాన్‌ గతంలో భాగస్వామిగా వ్యవహరించాడు. సోషల్ మీడియా, యాప్‌ల ద్వారా సినీ తారలకు జిషాన్, విలియమ్స్ డ్రగ్స్ సరఫరా చేశారనే అభియోగాలు నమోదయ్యాయి. కెంట్ అనే వ్యక్తి ద్వారా నైజీరియా నుంచి కొరియర్స్ ద్వారా హైదరాబాద్‌కు డ్రగ్స్‌ తీసుకొచ్చినట్లు నిందితులు అప్ప‌ట్లో ఎక్సైజ్ శాఖకు తెలిపారు.ఇలా ఒక‌రొక‌రికి మ‌ధ్య ఉన్న లింక్ ల‌ను క‌నుగొనే ప‌నిలో విచార‌ణ అధికారులు ఉన్నారు.

Next Story
Share it