Telugu Gateway
Cinema

ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన పూరీ జ‌గ‌న్నాథ్

ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన పూరీ జ‌గ‌న్నాథ్
X

టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసు మ‌ళ్ళీ మొద‌టికొచ్చింది. అప్ప‌ట్లో తెలంగాణ స‌ర్కారు ఈ కేసుపై ఎంతో హ‌డావుడి చేసి త‌ర్వాత ప‌క్క‌న ప‌డేసింది. డ్ర‌గ్స్ కేసు వెలుగులోకి వ‌చ్చిన స‌మ‌యంలో భారీ ఎత్తున ప్ర‌చారం కూడా చేసింది. కానీ అందుకు భిన్నంగా అస‌లు కేసును మాత్రం తేల్చ‌లేదు. ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైర‌క్ట‌రేట్ (ఈడీ) రంగంలోకి దిగ‌టంతో ఈ వ్య‌వ‌హారం మ‌ళ్ళీ మొద‌టికొచ్చిన‌ట్లు అయింది. అయితే ఈడీ విచార‌ణ‌లో ముఖ్యంగా ఆర్ధిక కోణంలోనే విచార‌ణ సాగే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. అస‌లు అమ్మ‌కందారు ఎవ‌రు?. ఎవ‌రు కొనుగోలు చేశారు..డ‌బ్బులు ఎవ‌రి ఖాతాల్లోకి వెళ్ళాయి అన్న కోణంలోనే ఈడీ ఫోక‌స్ పెడుతుంద‌ని స‌మాచారం. మ‌రి ఈడీ విచార‌ణ‌లో అయినా అస‌లు వాస్త‌వాలు బ‌య‌ట‌కు వ‌స్తాయా? లేదా అన్న అంశంపై వేచిచూడాల్సిందే.

ఇంత‌కు ముందు ఇచ్చిన షెడ్యూల్ ప్ర‌కారం టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ తొలి రోజు మంగ‌ళ‌వారం నాడు ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయ‌న త‌న తనయుడు ఆకాష్‌ పూరి, చార్టెడ్‌ అకౌంటెంట్‌తో కలిసి ఈడీ కార్యాలయ్యానికి చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పలు కీలక అంశాలపై ఈడీ ఆయన్ను ప్రశ్నించనుంది.విదేశీ బ్యాంక్‌ అకౌంట్లలో జమ అయిన డబ్బు లెక్కలపై ఈడీ ఆరా తీయనుంది. విచారణలో తేలే అంశాల ఆధారంగా తదుప‌రి చ‌ర్య‌లు ఉంటాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 12మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వీరిలో పూరీ జగన్నాథ్‌తో పాటు రానా దగ్గుబాటి, రకుల్‌ప్రీత్‌ సింగ్, చార్మి, రవితేజ, నవ్‌దీప్, ముమైత్‌ ఖాన్, తనీష్, తరుణ్, నందులతోపాటు రవితేజ డ్రైవర్‌ శ్రీనివాస్, ఎఫ్‌–క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌ కూడా ఉన్నారు.

ఈడీ విచారణకు హాజరుకానున్న ప్రముఖులు, విచారణ తేదీ

1.పూరి జగన్నాథ్‌ – ఆగస్టు 31

2.ఛార్మి – సెప్టెంబర్‌ 2

3.రకుల్‌ప్రీత్‌ సింగ్‌ – సెప్టెంబర్‌ 6

4.రాణా దగ్గుబాటి – సెప్టెంబర్‌ 8

5.రవితేజ – సెప్టెంబర్‌ 9

6.శ్రీనివాస్‌ – సెప్టెంబర్‌ 9

7.నవదీప్‌ – సెప్టెంబర్‌ 13

8 ఎఫ్‌ క్లబ్‌ జీఎం – సెప్టెంబర్‌ 13

9.ముమైత్‌ ఖాన్‌ – సెప్టెంబర్‌ 15

10.తనీష్‌ – సెప్టెంబర్‌ 17

11.నందు – సెప్టెంబర్‌ 20

12.తరుణ్‌ – సెప్టెంబర్‌ 22

Next Story
Share it