Telugu Gateway
Cinema

యానిమల్ తో మొదలై సలార్ తో క్లోజ్

యానిమల్ తో మొదలై సలార్ తో క్లోజ్
X

డిసెంబర్ సినిమాల సందడి రంగం సిద్ధం అయింది. ఈ ఏడాది చివరి నెలలో పలు కీలక సినిమాలు ఉన్నాయి. డిసెంబర్ ఒకటైన యానిమల్ సినిమా తో మొదలు అయ్యే సందడి ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన సలార్ సినిమాతో ముగియనుంది. ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రభాస్ హీరో గా నటించిన సలార్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ కావటంతో దీనిపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయనే చెప్పొచ్చు. యానిమల్ సినిమా డబ్బింగ్ మూవీ అయినా కూడా ఈ సినిమాను తెరకెక్కించింది టాలీవుడ్ కు చెందిన ప్రముఖ దర్శకుడు వంగా సందీప్ రెడ్డి కావటంతో దీనిపై తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. యానిమల్ లో హీరో రణబీర్ కపూర్ అయితే...హీరోయిన్ రష్మిక కావటం కూడా దీనిపై అంచనాలు పెరగటానికి మరో కారణం అని చెప్పుకోవచ్చు. యానిమల్ సినిమా కు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ దీనిపై ప్రేక్షుకుల ఆసక్తిని స్పష్టం చేస్తున్నాయి.

ఈ రెండు సినిమాలతో పాటు హీరో నాని, మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన హాయ్ నాన్న సినిమా కూడా డిసెంబర్ 7 న విడుదల కానుంది. ఒక్క రోజు గ్యాప్ లో అంటే డిసెంబర్ 8 న నితిన్, శ్రీ లీల నటించిన ఎక్సట్రా ఆర్డినరీ మ్యాన్ విడుదల అవుతుంది. తాజాగా విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్ నితిన్ కొత్త సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది అనే చెప్పాలి. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే సుధీర్ హీరో గా నటిస్తున్న కాలింగ్ సహస్త్ర సినిమా యానిమల్ విడుదల అవుతున్న డిసెంబర్ ఒకటినే విడుదల అవుతోంది. విరాజ్ అశ్విన్ నటించిన జోరుగా హుషారుగా సినిమా డిసెంబర్ 15 న విడుదల అవుతోంది. వీటితో పాటు మరికొన్ని చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఈ డిసెంబర్ బాక్స్ ఆఫీస్ విజేత ఎవరు అవుతారో చూడాలి. అయితే అందరి కళ్ళు ప్రభాస్ సినిమా సలార్ పైనే ఉన్నాయని చెప్పొచ్చు.

Next Story
Share it