Telugu Gateway
Cinema

బాక్స్ ఆఫీస్ పై పాన్ ఇండియా సినిమాల దండయాత్ర!

బాక్స్ ఆఫీస్ పై పాన్ ఇండియా సినిమాల దండయాత్ర!
X

బిగ్ ఫైట్. ఇది రాజకీయాల్లో కాదు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్న వేళ సినిమాల ఫైట్ కు రంగం సిద్ధం అవుతోంది. టాలీవుడ్ వేదికగా తెరకెక్కుతున్న సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి ఫలితాలు సాదించబోతున్నాయి అన్నదే ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం. మరి ఈ బిగ్ ఫైట్ లో కలెక్షన్ల రికార్డు ల బద్దలు కొట్టేది ఎవరు?. ఎవరి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఏ హీరో పాటకు యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ ..లైక్స్ వస్తాయి..ఏ సినిమా ట్రైలర్ అదిరిపోతుంది. ఫైనల్ గా ఏ సినిమా కలెక్షన్స్ తో రికార్డు లు బద్దలు కొడుతోంది. ఇదే ఇప్పుడు సినిమా అభిమానుల్లో హాట్ టాపిక్. ఈ మధ్యలో హీరో ల ఫ్యాన్స్ మధ్య సాగే సోషల్ వార్ ఎన్ని మలుపులు తీసుకుంటుందో అన్న ఆసక్తి.. టెన్షన్ టాలీవుడ్ వర్గాల్లో నెలకొంది. రాబోయే నెలల్లో విడుదల కానున్న భారీ సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి నే ముందు వరసలో ఉంటుంది అనే చెప్పాలి.

ఎందుకంటే ఈ సినిమా లో ప్రభాస్ తో పాటు దిగ్గజ నటులు అమితాబచ్చన్, కమల్ హాసన్ నటించటం ఒకెత్తు అయితే..ఈ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ సత్తాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ కలెక్షన్ల పరంగా ఖచ్చితంగా కొత్త రికార్డు లు నమోదు చేస్తుంది అని అటు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. అవి ఏ రేంజ్ లో ఉంటాయో వేచిచూడాల్సిందే. తాజాగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కల్కి సినిమా బుజ్జి పరిచయ ఈవెంట్ కూడా ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది అనే చెప్పాలి. కల్కి 2898 మూవీ జూన్ 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. కల్కి విడుదల తర్వాత మరో పెద్ద సినిమా అంటే అల్లు అర్జున్ హీరో గా నటిస్తున్న పుష్ప 2 . ఈ సినిమాపై కూడా దేశ వ్యాప్తంగా ఆసక్తి ఉంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వసూళ్లపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం పుష్ప ఫస్ట్ పార్ట్ అనే చెప్పాలి. ఇందులో అల్లు అర్జున్ మాస్ యాక్షన్...పాటలు పుష్ప ను ఎక్కడికో తీసుకెళ్లాయి. పుష్ప 2 ఆగస్ట్ 15 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీని తర్వాత లైన్ లో మరో టాప్ హీరో ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా వస్తుంది. ఈ సినిమా దసరాకు అంటే అక్టోబర్ 10 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ తో జాన్వీ కపూర్ తొలిసారి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న రెండవ పాన్ ఇండియా మూవీ ఇదే కావటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా దేవర కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ పాన్ ఇండియా సినిమా వసూళ్లు ఎంత మేర ఉంటాయి అన్నది కూడా అత్యంత కీలకం కానుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామ్ చరణ్ మూవీ గేమ్ ఛేంజర్ విడుదల తేదీ అధికారికంగా రాకపోయినా ఇది కూడా ఈ ఏడాది చివరిలో ఉంటుంది అని టాలీవుడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సినిమా లో రామ్ చరణ్ కు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కూడా తెలుగు, హిందీ , తమిళ భాషల్లో విడుదల కానుంది.

అంటే ఈ టాప్ హీరో ల సినిమా లు అన్ని పాన్ ఇండియా మూవీ లే. అంటే వరుసగా ప్రభాస్ సినిమా దగ్గర నుంచి మొదలు పెట్టి అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ మూవీ లు క్యూ కడుతున్నాయి. ఇవే కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ కూడా ఈ ఏడాది సెప్టెంబర్ 27 న విడుదల తేదీ ప్రకటించారు. ఇది కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీనే. ఈ భారీ సినిమా లతో పాటు మిడ్ రేంజ్ హీరో ల సినిమాలు కూడా చాలానే లైన్ లో ఉన్నాయి. మరి ఈ బిగ్ ఫైట్ లో ఎవరు ఫస్ట్ వస్తారో...ఎవరు బ్లాక్ బస్టర్ అందుకుంటారో వేచిచూడాల్సిందే. ఎన్నికల ఫలితాలు టెన్షన్ తరహాలో ఫ్యాన్స్ కు ఇప్పుడు సినిమా ఫలితాల టెన్షన్ తప్పేలా లేదు అనే చెప్పాలి.

Next Story
Share it