Telugu Gateway
Cinema

సత్తా చాటుతున్న టిల్లు స్క్వేర్

సత్తా చాటుతున్న టిల్లు స్క్వేర్
X

టిల్లు స్క్వేర్ సినిమా కు ఈ మధ్య కాలంలో ఏ సినిమా కు రాని రీతిలో పాజిటివ్ టాక్ వచ్చింది. సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. రెండు రోజుల్లో ఈ సినిమా 45 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా వెల్లడించింది. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఈ సినిమా దూసుకెళుతుండంతో నిర్మాత నాగవంశీ చెప్పినట్లు వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించటం పెద్ద కష్టం కాదు అనే చెప్పొచ్చు.

టిల్లు స్క్వేర్ లో డీ జె టిల్లు తరహాలోనే సిద్దు తన మ్యాజిక్ రిపీట్ చేశాడు. అనుపమ పరమేశ్వరన్ కూడా తన యాక్షన్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత డీ జె టిల్లు, ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమా కూడా సూపర్ హిట్ కావటం తో టిల్లు 3 కూడా ఉంటుంది అని నిర్మాత నాగవంశీ తెలిపారు. టిల్లు స్క్వేర్ విజయంతో చిత్ర యూనిట్ ఇప్పుడు ఫుల్ సంబరాల్లో ఉంది.

Next Story
Share it