Telugu Gateway
Cinema

టిల్లు స్క్వేర్ ఇక ఓటిటి వంతు

టిల్లు స్క్వేర్ ఇక ఓటిటి వంతు
X

బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపిన టిల్లు స్క్వేర్ ఇప్పుడు ఓటిటి సంగతి చూడటానికి సిద్ధం అయింది. ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఏప్రిల్ 26 నుంచి తెలుగు తో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో టిల్లు స్క్వేర్ సినిమా ఓటిటి లో ఉంటుంది అని అధికారికంగా వెల్లడించింది. టిల్లు స్టైల్ డైలాగులు జోడించి మరీ ఈ విషయం చెప్పింది. హిస్టరీ రిపీట్ కావటం సాధారణం. అదే టిల్లు వస్తే హిస్టరీ, మిస్టరీ, కెమిస్ట్రీ అన్ని రిపీట్ అవుతాయి. అట్లా ఉంటది టిల్లన్నతోని అని ఈ అప్డేట్ లో పేర్కొంది. డీజె టిల్లు కు కొనసాగింపుగా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు లు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దగ్గర దగ్గర 130 కోట్ల రూపాయల వరకు గ్రాస్ వసూళ్లు సాధించింది. సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ లు జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఫుల్ గా ఎంటర్ టైన్ చేసింది అనే చెప్పాలి. డీ జె టిల్లు లో రాధికా పాత్ర హై లైట్ అయితే...టిల్లు స్క్వేర్ లో లిల్లీ పాత్ర కూడా ఆకట్టుకుంది. అటు డీజె టిల్లు తర్వాత టిల్లు స్క్వేర్ కూడా సూపర్ హిట్ కావటంతో ఇప్పుడు చిత్ర యూనిట్ టిల్లు క్యూబు ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

Next Story
Share it