Telugu Gateway
Cinema

సిద్దు జొన్నలగడ్డ సెన్సేషన్ !

సిద్దు జొన్నలగడ్డ సెన్సేషన్ !
X

ఒకే ఒక్క సినిమా. సిద్దు జొన్నలగడ్డ కు ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. అదే డీ జె టిల్లు మూవీ. ఇప్పుడు డబల్ ధమాకా అంటూ టిల్లు స్క్వేర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పలు మార్లు వాయిదా పడిన తర్వాత ఇప్పుడు మార్చి 29 డేట్ ఫిక్స్ అయింది. ఇటీవల విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్ కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది. ఇది కూడా యూత్ ను టార్గెట్ గానే చేసుకుని తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. టిల్లు స్క్వేర్ కు సంబంధించి ఒక ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది.

సినిమాకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్ దీన్ని 35 కోట్ల రూపాయల రికార్డు ధర కోట్ చేసి దక్కించుకున్నట్లు టాలీవుడ్ టాక్. ఇది పరిశ్రమలో పెద్ద సంచలనంగా మారింది. ఒక యువ హీరో సినిమా కు ఈ ధర పలకటమే ఇప్పుడు చర్చనీయాంశగా మారింది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఎన్ని రికార్డు లు క్రియేట్ చేస్తుందో చూడాలి. డీ జె టిల్లు సూపర్ సక్సెస్ తో టిల్లు స్క్వేర్ పై కూడా భారీ అంచనాలే ఉన్నాయని చెప్పాలి.

Next Story
Share it