వచ్చే ఏడాదే టిల్లు స్క్వేర్
BY Admin27 Oct 2023 10:56 AM

X
Admin27 Oct 2023 10:56 AM
డీ జె టిల్లు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత సంచలన విజయం నమోదు చేసుకుందో అందరికి తెలిసిందే. దానికి కొనసాగింపుగా టిల్లు స్క్వేర్ సినిమా సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 15 నే విడుదల కావాల్సి ఉన్నావివిధ కారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు ఏకంగా ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 9 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో హీరో సిద్దు జొన్నలగడ్డకు జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటించిన విషయం తెలిసిందే. టిల్లు తన మాస్ యాక్షన్ తో థియేటర్లను అదరగొడతాడు అంటూ వెల్లడించారు. డబల్ ఫన్, డబల్ ఎంటర్ టైన్ మెంట్ అంటూ సిద్దు కూడా సోషల్ మీడియా ద్వారా కొత్త విడుదల తేదీని న్యూ లుక్ తో షేర్ చేశారు . ఈ సినిమా కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ తెరకెక్కిస్తున్నారు.
Next Story