Telugu Gateway
Cinema

కల నిజం చేసుకున్న సిద్దు

కల నిజం చేసుకున్న సిద్దు
X

సిద్దు జొన్నలగడ్డ. సరిగా రెండేళ్ల క్రితం మూడేళ్ళలో తాను వంద కోట్ల రూపాయలు వసూలు చేసిన సినిమా స్టార్స్ జాబితాలో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ రెండేళ్లలోనే ఈ లక్ష్యాన్ని అందుకున్నాడు. సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన టిల్లు స్క్వేర్ మూవీ వంద కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది. విడుదల అయిన తొమ్మిది రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 101 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. దీనికి సంబంధించిన న్యూ లుక్ ను కూడా విడుదల చేసింది.

ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా ఏప్రిల్ 8 న సక్సెస్ మీట్ నిర్వహించనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించారు కూడా . మార్చి 29 న టిల్లు స్క్వేర్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోంది. సినిమా విడుదల అయిన తొలి రోజే నిర్మాత నాగ వంశీ వంద కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. చెప్పినట్లే ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ సినిమా ఫ్యామిలీ స్టార్ కు పెద్దగా పాజిటివ్ టాక్ రాకపోవటంతో టిల్లు స్క్వేర్ వసూళ్లు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు.

Next Story
Share it