Telugu Gateway
Cinema

అమెరికాలో కూడా అదరగొడుతున్న టిల్లు స్క్వేర్

అమెరికాలో కూడా అదరగొడుతున్న టిల్లు స్క్వేర్
X

టిల్లు స్క్వేర్ సినిమా ఇండియా లోనే కాదు...అమెరికా లో కూడా అదరగొడుతోంది. అమెరికా లో ఇప్పటికే ఈ సినిమా రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. అంటే మన భారితీయ కరెన్సీలో 16 .60 కోట్ల రూపాయలపైనే. సిద్దు జొన్నలగడ్డ , అనుపమ పరమేశ్వరన్ లు కలిసి నటించిన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకువెళుతుంది. దీంతో నాలుగు రోజుల్లో కలుపుకుని ఈ సినిమాకు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 78 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. చిత్ర యూనిట్ చెప్పినట్లు త్వరలోనే ఈ సినిమా వంద కోట్ల రూపాయల గ్రాస్ క్లబ్ లో చేరనుంది.

Next Story
Share it