Telugu Gateway
Cinema

కమల్ కొత్త సినిమా అప్పుడే ఓటిటి లోకి

కమల్ కొత్త సినిమా అప్పుడే ఓటిటి లోకి
X

భారీ అంచనాల మధ్య విడుదల అయి బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టిన మూవీ థగ్ లైఫ్. దర్శకుడు మణిరత్నం, కమల్ హాసన్ సినిమా కావటంతో ఈ సినిమా పై పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ అయింది. జూన్ ఐదున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ డే నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ సినిమా కు వసూళ్లు కూడా నిరాశాజనకంగానే వచ్చాయి. కొద్ది రోజుల క్రితం దర్శకుడు మణిరత్నం థగ్ లైఫ్ మూవీ డిజాస్టర్ కావటంపై క్షమాపణలు చెప్పటం తప్ప తాను ఇంకేమి చేయలేను అని ప్రకటించిన సంగతి తెలిసిందే. బాక్స్ ఆఫీస్ వద్ద దారుణ ఫలితాన్ని చూసిన ఈ మూవీ ఇప్పుడు ఎలాంటి హంగామా లేకుండా ఓటిటి లోకి వచ్చేసింది.

ఇది ఇప్పుడు ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు తో పాటు తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమా లో కమల్ హాసన్ కు జోడిగా అభిరామి, త్రిష నటించారు. మరో కీలక పాత్రలో శింబు నటించింది సంగతి తెలిసిందే. బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన ఈ మూవీ మరి ఓటిటి లో ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుందో చూడాలి. గ్యాంగ్ వార్ లతో కూడిన ఈ సినిమా ప్రేక్షుకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. భారతీయుడు 2 సినిమా తర్వాత ఇప్పుడు కమల్ హాసన్ కు థగ్ లైఫ్ కూడా నిరాశనే మిగిలిచింది అని చెప్పాలి.

Next Story
Share it