Telugu Gateway
Cinema

ఇక కమల్ హాసన్ సినిమాలు కష్టమేనా?!(Thug Life Movie Review)

ఇక కమల్ హాసన్ సినిమాలు కష్టమేనా?!(Thug Life Movie Review)
X

కమలహాసన్..మణిరత్నం కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు. కానీ ఈ మధ్య కమలహాసన్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతుండటంతో చాలా మంది ఆయన కొత్త సినిమాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే థగ్ లైఫ్ సినిమాకు తెలుగు లో ఓపెనింగ్స్ కూడా పెద్దగా లేవు అనే చెప్పాలి. మణిరత్నం, కమలహాసన్ సినిమాలు అంటే ఒకప్పుడు ఉన్న క్రేజ్ ఇప్పుడు తగ్గిపోయిన విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కమల్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత దారుణ పరాజయం పాలు అయిందో తెలిసిందే. భారీ తారాగణంతో తెరకెక్కిన థగ్ లైఫ్ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది అనే చెప్పాలి. ఇందులో కమలహాసన్ తో పాటు శింబు (కొత్త పేరు సిలంబరసన్), త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి , నాజర్ కీలక పాత్రలు పోషించారు.

"థగ్ లైఫ్" అంటే "దొంగ జీవితం" లేదా "గ్యాంగ్‌స్టర్ జీవితం" అని అర్థం. ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ జీవితమే. చిన్నప్పుడే తన చేతిలో శింబు తండ్రి చనిపోవటంతో తనతో పాటు ఉంచుకుని సొంత కొడుకుగా చూసుకుంటాడు కమలహాసన్. తప్పిపోయిన శింబు చెల్లిని కూడా వెతికి పట్టుకునే బాధ్యత కూడా తనదే అంటారు. యముడితో పోరాడే గ్యాంగ్‌స్టర్ గా కమలహాసన్ ఈ సినిమాలో కనిపిస్తాడు. తొలుత రెండు గ్యాంగ్ ల మధ్య పోరాటం. తర్వాత ఒక గ్యాంగ్ సారధి రాజకీయాల్లోకి వెళ్లటంతో మొత్తం బాధ్యత గ్యాంగ్ ల బాధ్యత కమల్ టీం చేతుల్లోకి వస్తుంది. ఒక దశలో కమల్ తన గ్రూప్ లోని సొంత వాళ్ళను కూడా అనుమానించటంతో కథ మలుపు తిరుగుతుంది. రెండున్నర గంటల పైన సాగిన గ్యాంగ్‌స్టర్ మూవీ లో ఎక్కడా కూడా వావ్ మూమెంట్ ఒక్కటి అంటే ఒక్కటి కనిపించదు అనే చెప్పొచ్చు.

సినిమా అంతా కూడా చాలా రొటీన్ గా సాగిపోతుంది తప్ప...ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యే సన్నివేశాలు ఏమీ ఉండవు. టేకింగ్ విషయంలో మణిరత్నం స్టైల్ ప్రతి సీన్ లోనూ కనిపిస్తుంది. కానీ స్టోరీ ఏ మాత్రం ఆసక్తికరంగా లేకపోవటంతో సినిమా అంతా భారంగా ముందుకు సాగుతుంది అనే చెప్పాలి. ఉండేది కొద్ది సేపే అయినా త్రిష పాత్రా ఓకే. అక్కడక్కడ ఏ ఆర్ రహమాన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాను ఒకింత కాపాడింది అనే చెప్పాలి. సినిమాలో విజువల్స్ మాత్రం ఫుల్ రిచ్ గా ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే థగ్ లైఫ్ మూవీ లో అటు కమల్ హాసన్, ఇటు మణిరత్నం ల మ్యాజిక్ ఏదీ వర్క్ అవుట్ కాలేదు. దీంతో ఇద్దరు కలిసి ప్రేక్షకులకు మరో బోరింగ్ సినిమా ఇచ్చినట్లు అయింది.

రేటింగ్: 2 .25 /5

Next Story
Share it