రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు
చాలా కాలం తర్వాత మళ్ళీ పాత ప్రభాస్ కనిపించాడు. కేవలం 45 సెకన్ల గ్లింప్స్ తోనే రాజాసాబ్ లో ఈ పాన్ ఇండియా హీరో ఎలా సందడి చేయబోతున్నాడో దర్శకుడు మారుతీ ఒక శాంపిల్ చూపించాడు. బైక్ పై వచ్చి అద్దం లో తనకు తాను పూలతో దిష్టి తీసుకునే ఈ గ్లింప్స్ వీడియో ఆకట్టుకునేలా ఉంది. ఈ గ్లింప్స్ లోనే సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. రాజాసాబ్ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హారర్..రొమాంటిక్, కామెడీ మూవీ గా ఇది తెరకెక్కుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ పేరుతో ఈ వీడియోను విడుదల చేశారు.