కాకుల కథతో సినిమా!
హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చిన దసరా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత పెద్ద విజయం దక్కించుకుందో తెలిసిందే. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్ లోనే ది పారడైజ్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను చిత్ర యూనిట్ సోమవారం నాడు విడుదల చేసింది. ఇది చూసిన ప్రేక్షకులు షాక్ కు గురి అయ్యారు అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని కథ తో ...పూర్తి స్థాయి యాక్షన్ సన్నివేశాలతో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు గ్లింప్స్ చూస్తే స్ఫష్టం అవుతోంది. చరిత్రలో అందరూ చిలకలు...పావురాల గురించి రాసిన్రు కానీ...అదే జాతిలో పుట్టిన కాకుల గురించి ఎవరూ రాయలేదు.
ఇది కడుపు మండిన కాకుల కథ. జమానా జమానా కెళ్ళి నడిచే శవాల కథ. అమ్మ రొమ్ములో పాలు లేక ..రక్తం పోసి పెంచిన ఒక జాతి కథ. నా కొడుకు నాయకుడు అయిన కథ అంటూ సాగే వాయిస్ ఓవర్ తో ఈ గ్లింప్స్ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది అనే చెప్పాలి. ఇందులో డైలాగులు అన్ని పూర్తి తెలంగాణ స్లాంగ్ లోనే ఉన్నాయి. ఇందులో హీరో నాని లుక్ కూడా షాకింగ్ గా ఉంది అనే చెప్పాలి. ఊహించని స్థాయిలో గ్లింప్స్ అందించారు అని...ఇది చూస్తుంటే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండేలా ఉంది అని కామెంట్స్ పెడుతున్నారు సినీ అభిమానులు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26 న పాన్ ఇండియా మూవీ గా విడుదల కానుంది. అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు ఈ సినిమాకి.