Telugu Gateway
Cinema

బాలకృష్ణ విలన్ ఫిక్స్

బాలకృష్ణ విలన్ ఫిక్స్
X

నందమూరి బాలక్రిష్ణ సినిమాలోకి ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఎంటర్ అయ్యారు. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఎన్ బికె 109 లో బాబీ డియోల్ విలన్ గా నటించనున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పుడు చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. నిర్మాత నాగ వంశీ, దర్శకుడు బాబీ, బాబీ డియోల్ లు కలిసి ఉన్న ఫోటో ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. వంగా సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్ సినిమా లో విలన్ పాత్ర తర్వాత బాబీ డియోల్ కు డిమాండ్ పెరిగినట్లు కనిపిస్తోంది.

హంటర్ ఎంటర్స్ అంటూ బాబీ డియోల్ ను ఆహ్వానిస్తూ చిత్ర యూనిట్ బాలకృష్ణ కొత్త సినిమా పై అంచనాలు మరింత పెంచింది అనే చెప్పాలి. ప్రస్తుతం ఎన్నికల బిజీ లో ఉన్న బాలక్రిష్ణ మే 13 న పోలింగ్ ముగిసిన వెంటనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయటంపై దృష్టి పెడతారు అని చెపుతున్నారు. యువ హీరో లకు ధీటుగా బాల క్రిష్ణ కూడా వరసగా సినిమా లు చేస్తూ హిట్స్ తో దూసుకెళుతున్నారు. గత ఏడాది సంక్రాంతికి చిరంజీవి, రవి తేజ లకు వాల్తేర్ వీరయ్య తో హిట్ ఇచ్చిన దర్శకుడు బాబీ. ఇప్పుడు బాల క్రిష్ణ, బాబీ కాంబినేషన్ లో సినిమా వస్తుండంతో దీనిపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయనే చెప్పాలి.

Next Story
Share it