Telugu Gateway
Cinema

హిట్ మూవీ అప్పుడే ఓటిటి లోకి

హిట్ మూవీ అప్పుడే ఓటిటి లోకి
X

ఈ ఏడాది సంక్రాంతి సినిమాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ దక్కించుకున్న మూవీ తండేల్. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా కు ముందు నుంచే మంచి బజ్ ఏర్పడింది. దీనికి తోడు నిర్మాతలు కూడా కచ్చితంగా తమ సినిమా వంద కోట్ల వసూళ్ల జాబితాలో చేరుతుంది అని ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్లుగానే తండేల్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్ల రూపాయల కు పైనే గ్రాస్ వసూళ్లు సాధించింది. నాగచైతన్య కెరీర్ లోనే వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన తొలి సినిమా ఇదే. సెన్సిబుల్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ మూవీ ఇప్పుడు ఓటిటి లోకి వస్తోంది.

మార్చి ఏడు నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఇది అందుబాటులో ఉంటుంది అని తెలిపారు. ఫిబ్రవరి ఏడున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సరిగ్గా నెల రోజుల వ్యవధిలో ఇది ఓటిటి ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుండంతో థియేటర్ లో ఈ సినిమా చూడని వాళ్లకు ఇది శుభవార్తగానే చెప్పొచ్చు. తండేల్ సినిమా కు దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ కూడా హై లైట్ గా నిలిచింది. సినిమా విజయంలో ఇది కూడా కీలక పాత్ర పోషించింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జాలర్లు గుజరాత్ నుంచి చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు పాకిస్థాన్ లోకి వెళ్లటంతో వాళ్ళను అరెస్ట్ చేసి కరాచీ జైలు లో పెడతారు. ఈ వాస్తవ కథను కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించడంలో దర్శకుడు సఫలం అయ్యారు అనే చెప్పాలి.

Next Story
Share it