Telugu Gateway
Cinema

దిల్ రాజు..నితిన్ చెప్పింది నిజం అయిందా?!(Thammudu Movie Review)

దిల్ రాజు..నితిన్ చెప్పింది నిజం అయిందా?!(Thammudu Movie Review)
X

హీరో నితిన్ కు హిట్ లేక చాలా కాలమే అయింది. కొద్దినెలల క్రితం విడుదల అయిన రాబిన్ హుడ్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో నితిన్ కూడా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమ్ముడు సినిమా పై భారీ ఆశలే పెట్టుకున్నాడు. గతంలో చేసిన తప్పులు చేయనని..ఇక నుంచి మంచి సినిమాలే చేస్తానని ప్రకటించాడు. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు అయితే గత కొన్ని రోజులుగా ఈ తమ్ముడు సినిమా కు ఎంత హైప్ తీసుకురావాలో అంతా ప్రయత్నించారు. తమ్ముడు సినిమాతో నితిన్ ఇక హిట్స్ బాట పడుతాడు నమ్మండి అన్నంత ధీమా చూపించాడు. కానీ ఈ శుక్రవారం నాడు విడుదల అయిన తమ్ముడు సినిమా అటు నితిన్, ఇటు దిల్ రాజు చెప్పిన విషయాలు ఏదీ నిజం చేయలేకపోయింది అనే చెప్పొచ్చు. ఈ సినిమాలో కాస్త ఏదైనా కొత్తదనం ఉంది అంటే విలన్ పాత్ర పోషించిన సౌరభ్ సచ్ దేవ కు ఉండే సమస్య...దాన్ని చూపించిన విధానం ఒక్కటే అనే చెప్పాలి. ఇక సినిమా కథ విషయానికి వస్తే ఒక ఫ్యాక్టరీ లో పేలుడు...ఈ పేలుడు కేసు నుంచి తప్పించుకునేందుకు రాజకీయ నాయకులకు లంచాలు ఇచ్చి తప్పించుకున్న యజమాని..నిజాయతీపరురాలు అయిన అధికారిని దారికి తెచ్చుకునేందుకు వేసే ఎత్తుగడలతోనే సినిమా అంతా సాగుతుంది.

అక్క ఇచ్చిన మాట మీద నిలబడేందుకు తమ్ముడు చేసిన సాయం ఏంటి...చిన్నప్పుడే అక్కకు దూరమైనా తమ్ముడిని ఆమె తిరిగి అక్కున చేర్చుకుందా లేదా అన్నదే ఈ మూవీ స్టోరీ. నితిన్ అక్కగా ఈ సినిమాలో లయ నటించింది. ఆమె చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది అనే చెప్పాలి. నితిన్ కు జోడిగా వర్ష బొల్లమ్మ నటించినా వీళ్ళ మధ్య పెద్దగా లవ్ ట్రాక్ ఏమి లేదు. మరో కీలక పాత్రలో కనిపించిన సప్తమి గౌడ రోల్ మాత్రం కాస్త వెరైటీ గా ఉంది అనే చెప్పాలి. ఒక జాతరకు వెళ్లి వచ్చే సమయంలో ఫ్యాక్టరీ ప్రమాదంపై తుది నివేదిక ఇవ్వాల్సిన లయ ఫ్యామిలీ ప్రమాదంలో చిక్కుకున్న సమయంలో వచ్చే ఫైట్ సీన్స్ ..వయలెన్స్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది అనే చెప్పాలి. సినిమా మొత్తంలో ఎక్కడా కూడా ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యే సన్నివేశాలు ఒక్కటి ఉండవు. సినిమాలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉన్నా సినిమా కథలో దమ్ములేకపోవటంతో దీనివల్ల పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్నా కూడా తమ్ముడు సినిమా నితిన్ కు మరో సారి నిరాశనే మిగిల్చింది అనే చెప్పాలి.

రేటింగ్ : 2 .25 -5

Next Story
Share it