దేవతలా ఫీల్ అవుతున్నానంటున్న తమన్నా
BY Admin24 Nov 2021 2:21 PM IST

X
Admin24 Nov 2021 2:21 PM IST
తమన్నా ఓ సోఫా మీద కూర్చుని అరటి ఆకులో ఆహారం తింటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అరటి ఆకులో ఆహారం పెట్టుకుని తింటూ తాను ఓ దేవతగా ఫీల్ అవుతానని పేర్కొంది. పర్యావరణానికి కూడా ఇది ఎంతో మంచిది అంటూ చెప్పుకొచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మళ్లీ మూలాల్లోకి వెళ్ళటమే అంటూ అభిప్రాయపడింది. నిజంగానే ఓ కిరిటం పెట్టుకుని, దేవత తరహాలో వస్త్రాలు ధరించిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది తమన్నా. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ భామ మెగాస్టార్ చిరంజీవితో కలసి భోళాశంకర్ లో సందడి చేయనున్న విషయం తెలిసిందే.
Next Story