పది కోట్ల రోల్స్ రాయిస్ కొన్న పఠాన్!

ఇప్పటికే షారుఖ్ ఖాన్ గ్యారేజ్ లో ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. వాటికి కొత్తగా రోల్స్ రాయిస్ కలినన్ బ్లాక్ బ్యాడ్జి ఎస్ యూవీ జత అయింది . ఈ ఖరీదైన ఎస్ యూవీ ని షారుఖ్ ఖాన్ తనకు అవసరమైన రీతిలో మార్పులు చేయించుకున్నారు. కొత్త కొత్త కార్లు కొనుగోలు చేయటం షారుఖ్ ఖాన్ కు సరదా కూడా. అయన ఒక్కో సినిమాకు వంద కోట్ల రూపాయల పైనే రెమ్యూనరేషన్ తీసుకుంటారనే ప్రచారం ఉంది. అదే సమయంలో ప్రపంచంలోనే సంపన్న హీరోల్లో కూడా షారుఖ్ ఖాన్ ముందు వరసలో ఉంటారు. అంతే కాదు..భారత్ నుంచి ఆ రేంజ్ ఆదాయం ఉన్న హీరోల్లో అయన ఒక్కడే కావటం కూడా మరో విశేషం.