Telugu Gateway
Cinema

జియో హాట్ స్టార్ లో

జియో  హాట్ స్టార్ లో
X

తేజా సజ్జా హీరో గా నటించిన సినిమా మిరాయి.బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 150 కోట్ల రూపాయల పైనే గ్రాస్ వసూళ్లను సాధించింది. బాక్స్ ఆఫీస్ మంచి విజయాన్ని దక్కించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లోకి వస్తోంది. అక్టోబర్ 10 నుంచి జియో హాట్ స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. తెలుగు తో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండనుంది. మిరాయి సినిమాలో తేజా సజ్జా తో పాటు మంచు మనోజ్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన మూవీ ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కించుకుంది. ముఖ్యంగా ఇందులో వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయనే చెప్పాలి. అతి తక్కువ బడ్జెట్ తో ఈ సినిమా ద్వారా మంచి క్వాలిటీ అవుట్ ఫుట్ ఇచ్చారు అంటూ పలువురు మిరాయి పై ప్రశంసల వర్షం కురిపించారు. అడ్వెంచరస్ డ్రామాగా వచ్చిన మిరాయి మూవీ హను మాన్ తర్వాత తేజా సజ్జా కెరీర్ లో మరో భారీ హిట్ గా నిలిచింది. థియేటర్ లో సినిమా చూడకుండా ఓటిటి విడుదల కోసం ఎదురుచూస్తున్నా వాళ్లకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

Next Story
Share it